News January 8, 2026

GNT: కాలేజీ టాయిలెట్స్‌లో విద్యార్థి సూసైడ్.. కారణమిదేనా.?

image

గుంటూరులోని ఓ యూనివర్సిటీ విద్యార్థి రాఘవేంద్ర వెంకట్ బుధవారం కాలేజీ టాయిలెట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన <<18792920>>విషయం తెలిసిందే.<<>> తెనాలి (M) నందివెలుగుకి చెందిన అతడి ఆత్మహత్యకు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, బ్యాక్ లాగ్స్ కారణమని తెలుస్తోంది. రోజు మాదిరిగా కాలేజీకి వచ్చిన వెంకట్ మధ్యలో స్నేహితుడు బైక్ తీసుకొని వెళ్లి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకొని టాయిలెట్లో నిప్పు అంటించుకున్నట్లు సమాచారం.

Similar News

News January 28, 2026

టేబుల్‌టాప్ రన్‌వేలు ఎందుకు డేంజరస్?

image

* పీఠభూమి/కొండపై రన్‌వేతో 2 వైపులా లోయలు ఉండటం.
* రన్‌వే హారిజాంటల్‌గా, తక్కువ దూరం ఉన్నట్టు కనిపించడం.
* బ్రేకింగ్, గో అరౌండ్‌కు రన్‌వే పొడవు తక్కువగా ఉండటం.
* ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో అకాల వర్షం, టైల్‌విండ్, తక్కువ విజిబిలిటీతో ల్యాండింగ్‌.
* పైలట్లు తప్పుగా అంచనా వేసి ఓవర్‌షూట్/అండర్‌షూట్ చేసే ఛాన్స్.
* ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం వంటి అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ సపోర్ట్ లేకపోవడం.

News January 28, 2026

నంద్యాల జిల్లా MPTC కిడ్నాప్!

image

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన MPTC సంటిగారి కృపాకర్‌ నరసరావుపేటలో కిడ్నాప్‌కు గురయ్యారు. జూపాడు బంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎంపీటీసీలంతా నరసరావుపేటలో ఒక అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం రాత్రి కొందరు వచ్చి కృపాకర్‌ను బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 28, 2026

నెల్లూరు: పైసలివ్వందే.. పని ముట్టరు!

image

కరెంటోళ్లు మామూలోల్లు కాదు.. గ్రామాల్లో వారు చెప్పిందే వేదం. ఎప్పుడొస్తే అప్పుడే పని. అప్పటివరకు ప్రమాదమైనా అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిందే. పని చేస్తే వాళ్లు అడిగినంత ఇవ్వాల్సిందే. లేకుంటే తిరిగి ముఖం కూడా చూడరు. మరోవైపు 247 మంది లైన్‌మెన్లకు కేవలం 50 మంది మాత్రమే ఉండడం వీరికి డిమాండ్‌ పెరిగింది. ఇంత కొరత ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడం గమనార్హం.