News January 26, 2026
GNT: గణతంత్ర వేడుకల బందోబస్తు పర్యవేక్షిస్తున్న ఎస్పీ

రాయపూడిలో జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక, గ్యాలరీలు, వీవీఐపీ ప్రాంతాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ గస్తీపై సమీక్షించి అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు అమలు చేయాలని సూచించారు.
Similar News
News February 21, 2026
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు: SP

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పోలీసు శాఖ తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా ప్రణాళికలు సిద్దం చేశామని, పరీక్షలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జరిగేలా చూస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో యజామాన్యాలు సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు విద్యార్థులు తేవద్దన్నారు.
News February 21, 2026
GNT: శనగ రైతులకు జాయింట్ కలెక్టర్ సూచన

జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు JC అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రబీ 2025-26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర రూ. 5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తామన్నారు. 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేలమెట్రిక్ టన్నుల అంచనా ఉందన్నారు.
News February 21, 2026
GNT: మెడికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 28 వరకు పొడిగింపు

గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్‌ను ప్రజల విజ్ఞప్తితో ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఇకపై మరింత గడువు లేదని ప్రిన్సిపల్ డా. సుందరాచారి స్పష్టం చేశారు. వేలాది మంది ఇప్పటికే సందర్శించారు. ఎండల దృష్ట్యా తాగునీరు, శౌచాలయాల వంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ యువతి ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించడం ఆకట్టుకుంది.


