News January 12, 2026

GNT: గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక!

image

గుంటూరు జిల్లాలో 1991 జనవరి 12న జన్మించిన ద్రోణవల్లి హారిక అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి. చిన్నవయసులోనే అండర్-9, 10, 14, 18 విభాగాల్లో ప్రపంచ స్థాయి పతకాలు సాధించింది. మహిళా గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ హోదాలను దక్కించుకుంది. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో మూడుసార్లు (2012, 2015, 2017) కాంస్య పతకాలు గెలిచింది. ఆమె ప్రతిభకుగాను కేంద్రం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.

Similar News

News February 2, 2026

గుంటూరు, ఎన్టీఆర్ ముఖ్య నేతలతో వైసీపీ అత్యవసర భేటీ

image

మాజీ సీఎం YS జగన్ ఆదేశాల మేరకు YCP కేంద్ర కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. గుంటూరు, NTR జిల్లాల కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ సమావేశంలో పాల్గొంటారు. అదే కార్యాలయంలో బ్రాహ్మణ నాయకులతో మరో సమావేశం జరగనుంది. 33 మంది బ్రాహ్మణ నేతలు హాజరుకానున్నారు.

News February 2, 2026

గుంటూరు జిల్లా నుంచి విడిపోయి నేటికి 56 ఏళ్లు

image

నేడు ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం.1970 ఫిబ్రవరి 2న గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం 1972లో దీనికి ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. ఒంగోలు గిత్త, పొగాకు, చేనేతకు ఈ జిల్లా ప్రసిద్ధి. జిల్లా ఏర్పడి 56 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 2, 2026

అంబటి అరెస్టుపై ముద్రగడ లేఖ

image

మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుపై ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టాలని ఎద్దేవా చేశారు. కాపు కులాన్ని టార్గెట్ చేసి.. అంబటి కుటుంబాన్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వల్లే మీకు అధికారం వచ్చిందని, లడ్డూ కల్తీపై అబద్ధాలు చెప్పారని లేఖలో ధ్వజమెత్తారు.