News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.
Similar News
News October 28, 2025
GNT: ‘మొంథా’ ప్రభావం..ZP సమావేశంపై అనిశ్చితి

గుంటూరు జిల్లాలో మొంథా తుపాన్ కారణంగా బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనిశ్చితిలో పడింది. వర్షాలు, గాలుల ప్రభావంతో ప్రజా ప్రతినిధుల రాకపోకలు కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తగినంత మంది జెడ్పీటీసీలు హాజరు కాకపోతే సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News October 28, 2025
GNT: మిర్చి, పసుపు యార్డులకు 2 రోజులు సెలవు

మొంథా తుపాన్ ప్రభావం కారణంగా గుంటూరు మిర్చి యార్డుకు మంగళ, బుధవారాలు సెలవు ప్రకటించారు. రైతులు సరుకు తీసుకురావద్దని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. కమిషన్ ఏజెంట్లు రహదారులపై సరుకు నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దుగ్గిరాల పసుపు యార్డుకు కూడా 2 రోజులు సెలవు ప్రకటించారు. రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.
News October 28, 2025
గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావం

మంగళగిరి కొత్తపేట, కొలకలూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమవారం మోస్తరుగా వర్షం కురిసింది. తుపానుతో గాలి వేగం పెరిగి, చలి ఎక్కువగా ఉంది. పూరి గుడిసెలు, శిథిల భవనాలు ఖాళీ చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పర్యటనలో ప్రమాదం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, ప్రజలు ఇళ్లలో ఉండాలని, అవసరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.


