News October 12, 2025

GNT: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

మంగళగిరి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుంటూరు వైపు నుంచి విజయవాడకు స్కూటీపై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టింది. దీంతో వారు రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో భారీ వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News October 12, 2025

మోదీకి ట్రంప్ ఆహ్వానం

image

రేపు ఈజిప్టులో జరగనున్న గాజా శాంతి ఒప్పందానికి ట్రంప్ మోదీని ఆహ్వానించారు. అటు ఈజిప్టు అధ్యక్షుడు కూడా ఆయనను ఆహ్వానించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదలపై ఈ ఒప్పందంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా మోదీ హాజరుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News October 12, 2025

పెద్దపంజాణిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

image

పెద్దపంజాణి మండలం వీర పల్లె కొండపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతుండగా అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు సమాచారం. తవ్వకాలకు ఉపయోగిస్తున్న జేసీబీతో పాటు కారు, నాలుగు బైకులు, పూజా సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పుంగనూరు మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. మరో నలుగురు పరారీ కాగా వారికోసం గాలిస్తున్నారు.

News October 12, 2025

ADB: కూలెక్కిన రాజకీయం..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజుల వరకు భారీగా ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు అసలు ఇప్పట్లో జరుగుతాయని ప్రశ్న అందరిలో మొదలైంది. ఉట్నూరు, నార్నూర్ తదితర మండలాల్లో నాయకులు కనీసం చాయ్ కూడా తాపడం లేదని చర్చ నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల అరే ఇప్పుడు కాదు మల్ల పెద్దగానే దావత్ చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.