News July 7, 2025
GNT: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో బీ.ఏ, బీ.కామ్, బీ.బీ.ఏ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 30-ఆగస్టు 7 మధ్య నిర్ణీత తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ పరీక్షలు జరుపుతామని, పూర్తి వివరాలకు సంబంధిత స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని కోరింది.
Similar News
News July 7, 2025
జగన్ మానసిక స్థితి బాగాలేదు: మంత్రి సుభాష్

AP: వైసీపీ చీఫ్ జగన్ మానసిక స్థితి బాగాలేదని మంత్రి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరింటికి వెళ్లి ఓదార్చాలో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన నేరస్థులకు అండగా ఉంటున్నారని విమర్శించారు. మరోవైపు తాము ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షం విమర్శిస్తోందని ఫైరయ్యారు. కూటమి పాలనను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు.
News July 7, 2025
ఏలూరు: పీజీఆర్‌ఎస్‌కు 55 ఫిర్యాదులు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 55 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. వీటి స్థితిని తెలుసుకోవాలంటే 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు https://meekosam. ap. gov. in వెబ్‌సైట్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వృద్ధుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు.
News July 7, 2025
పటాన్ చెరు: విషాదం.. ఫ్యానుకు టవల్ బిగుసుకుని విద్యార్థిని మృతి

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్లో విషాదం నెలకొంది. నాలుగో తరగతి చదువుతున్న సహస్ర ఫ్యానుకు టవల్ వేసుకుని ఆడుకుంటూ ఉండగా, ఒక్కసారిగా కరెంటు రావడంతో స్విచ్ ఆన్లో ఉన్న ఫ్యాన్ తిరిగింది. దీంతో టవల్ మెడకు బిగుసుకుపోవడంతో సహస్ర అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్ చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.