News October 31, 2025

GNT: తెలుగులో ఏపీ రాజకీయ చరిత్ర రచించిన గొప్ప వ్యక్తి

image

రాజకీయ, సాంఘిక, తాత్విక రచనలు తెలుగులో రచించిన నరిశెట్టి ఇన్నయ్య 1937, అక్టోబర్ 31న చేబ్రోలు శివారు పాతరెడ్డిపాలెంలో జన్మించారు. ప్రముఖ హ్యూమనిస్ట్ ఎం.ఎన్. రాయ్‌ రచనలు ఆయన తెలుగులో అనువదించగా, తెలుగు అకాడమీ వీటిని ప్రచురించింది. తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించారు. ఈయన జాతీయ హేతువాద సంఘంకి కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1954 నుంచి పదేళ్ల పాటు “ప్రజావాణి” పత్రికలో పనిచేశారు.

Similar News

News October 31, 2025

జగిత్యాలలో ఉత్సాహంగా “Run For Unity”

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా Run For Unity కార్యక్రమం ఘనంగా జరిగింది. SP అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. SP మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ ఐక్యత సూత్రధారి అన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలతో పాటు జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలన్నారు.

News October 31, 2025

కామారెడ్డి: ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని చెప్పారు. ఈ గడువు తర్వాత చెల్లించేవారు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవలసి ఉంటుందని ఆయన సూచించారు.

News October 31, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిర్చి మార్కెట్‌కు శుక్రవారం 45,000 బస్తాల మిర్చి వచ్చింది. తేజా రకం ధరలు ₹13,000 నుంచి ₹15,200 వరకు పలికాయి. అసాధారణ నాణ్యత గల డీలక్స్ రకాలు ₹15,700 వరకు అమ్ముడయ్యాయి. 341 రకం అత్యధికంగా ₹16,500 ధరను తాకింది. DD, NO-5 రకాలు కూడా డీలక్స్‌లో ₹16,000 వరకు పలికాయి. ఆర్మూర్ వంటి రకాలు ₹11,000 కనిష్టంగా నమోదయ్యాయి. పసుపు మిర్చికి నాణ్యత కొరవడింది. తేజా ఫాట్కీ ₹8,200 నుంచి ₹10,000 మధ్య పలికింది.