News November 1, 2025
GNT: నేటికి 41ఏళ్లు.. మొదటి లోకాయుక్త మన వారే.!

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ 1983 నవంబర్ 1న ఏర్పాటయింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విచారణ జరిపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ. మొదటి లోకాయుక్తగా అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు నియమితులయ్యారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. కాగా ఆయన మన ఉమ్మడి గుంటూరు జిల్లా మూల్పూరులో జన్మించారు.
Similar News
News November 1, 2025
జగిత్యాల: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్..!

జగిత్యాలలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 2,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఇదిలా ఉండగా షేర్ హోల్డర్ల లిస్టులో తమ పేరు ఉందని, అయినప్పటికీ ఓటర్ లిస్టులో పేరు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
News November 1, 2025
నెల్లూరు: KGBV హాస్టళ్లలలో పోస్టులు

నెల్లూరు జిల్లాలోని KGBV లలో PGT, CRT గెస్ట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. లింగసముద్రం, కందుకూరు, సీతారామపురం, కలిగిరి కేజీబీవీలలో ఆయా ఖాళీల సబ్జెక్టులకు సంబంధించి గంటకు రూ. 2చొప్పున చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 4 లోపు ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
News November 1, 2025
సంగారెడ్డి: అనుమతులు లేని కళాశాలలపై కఠిన చర్యలు

సంగారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అనుమతులు లేని కళాశాలల్లో చేరి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలోనే ప్రవేశాలు పొందాలని విద్యార్థులకు సూచించారు.


