News December 27, 2025
GNT: నేడు జీఎంసీ కౌన్సిల్ సమావేశం .

గుంటూరు నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ మేరకు మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటల నుంచి సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరవ్వాలని కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
Similar News
News December 27, 2025
ఇంగ్లీషు జర్నలిజంలో యలవర్రు నుంచి ఢిల్లీ దాకా

ఆంగ్ల జర్నలిస్ట్ DAగా ప్రసిద్ధులైన ధూళిపూడి ఆంజనేయులు 1924లో యలవర్రులో జన్మించారు. విద్యార్థిదశ నుంచి ఇంగ్లీషు సాహిత్యం పట్ల ఆసక్తితో రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా తనను తాను రూపుదిద్దుకున్నారు. ఆయన జర్నలిస్టుగా క్వెష్ట్, ఇండియన్ రివ్యూ, థాట్, ఇండియన్ లిటరేచర్, త్రివేణి, ఫైనాంషియల్ ఎక్స్ ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇండియన్ రైటింగ్ టుడే వంటి పత్రికలకు రచనలు చేశారు.
@నేడు ఆయన వర్ధంతి.
News December 27, 2025
GNT: మంత్రి పేరిట మోసం.. రూ.1.15 కోట్లు టోకరా.!

మంత్రి కొల్లు రవీంద్రకు ఏజెంట్లుగా పనిచేస్తున్నాం.. లిక్కర్ మార్ట్ మంజూరు చేయిస్తామంటూ రూ.1.15 కోట్లు వసూలు చేసిన వంకాయలపాటి రాంబాబు, సాయికిరణ్‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. SVN కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు నుంచి నిందితులు డబ్బులు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా లిక్కర్ మార్ట్ మంజూరు కాలేదు. బాధితుడు మంత్రిని కలవగా వారు తనకు తెలియదని చెప్పడంతో మోసపోయానని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
News December 27, 2025
గుంటూరు: ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.5 లక్షలు టోకరా

తాడికొండ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం చీటింగ్ కేసు నమోదైంది. రావెల గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు వీలేటి నాగచైతన్య వివరాల మేరకు.. మైలబత్తుల బాబు మహేష్, బాలరామ్, నందా కలిచ హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ ఆఫర్ లేఖ చూపించి, రూ.5 లక్షలు తీసుకున్నారన్నారు. అనంతరం కంపెనీకి వెళ్లగా, ఆ ఆఫర్ లేఖ నకిలీదని తేలింది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.


