News December 27, 2025
GNT: నేడు విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్

విభిన్న ప్రతిభావంతులకు శనివారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఇన్‌ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు దుర్గా భాయ్ తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. జిల్లాలో విభిన్నప్రతిభావంతులు, వయోవృద్దులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ గ్రీవెన్స్‌కు హాజరై వారి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
Similar News
News December 30, 2025
జిల్లాలో 1,090 కేసులలో ₹11.88 కోట్ల ఆస్తి రికవరీ

2025లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,090 చోరీ కేసులు నమోదయ్యాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా రూ.11,88,55,702 విలువైన ఆస్థిని రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన 176 కేసుల్లోనూ రికవరీ పూర్తి చేసి బాధితులకు ఆస్తులు అప్పగించారు. నేరాల నియంత్రణలో పోలీసుల సమర్థత ప్రశంసనీయం.
News December 29, 2025
REWIND: ఈ ఏడాది గుంటూరు జిల్లాలో క్రూరమైన ఘటన ఇదే..!

గుంటూరు జిల్లాలో ఈ ఏడాది జరిగిన నేరాల్లో ఫిరంగిపురంలో చోటుచేసుకున్న చిన్నారి హత్య అత్యంత హృదయవిదారక ఘటనగా మిగిలిపోయింది. మార్చి 29న ప్రకాశం పంతులు కాలనీలో సవతి తల్లి లక్ష్మి కిరాతకానికి ఆరేళ్ల కార్తీక్ బలైపోయాడు. పసివాడని కూడా చూడకుండా గోడకేసి కొట్టి చంపిన తీరు ప్రజలను కంటతడి పెట్టించింది. మరో చిన్నారిని సైతం పెనంపై కూర్చోబెట్టి హింసించిన లక్ష్మి రాక్షసత్వం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
News December 29, 2025
REWIND: తెనాలిలో ఈ ఏడాది జరిగిన సంచలన ఘటన ఇదే..!

తెనాలిలో ఈ ఏడాది జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానిస్టేబుల్‌పై దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మే 20న వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులను పరామర్శించేందుకు జూన్ 3న వైఎస్ జగన్ తెనాలి రావడం కూడా విమర్శలకు కారణమైంది. పోలీసుల చర్యలను కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు.


