News March 9, 2025
GNT: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు

ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు పనిచేస్తున్నారు.
Similar News
News March 10, 2025
పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సోమవారం నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఫిర్యాదిదారులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 9, 2025
PGRSలో ఫిర్యాదులు అందించండి : GNT ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతుందని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో తిరిగి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఫిర్యాది దారులు ఈ విషయాన్ని గమనించి పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News March 9, 2025
దుగ్గిరాల: వడదెబ్బకు గురై చిరువ్యాపారి మృతి

దుగ్గిరాల మండలం ఈమనికి చెందిన చిరువ్యాపారి మృతిచెందాడు. పులివర్తి సురేశ్ (45) ద్విచక్ర వాహనంపై అరటిగెలలు పెట్టుకుని పరిసర గ్రామాల్లో ప్రజలకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం దుగ్గిరాల వెళుతున్నానని చెప్పి వెళ్లిన సురేశ్ పోస్టాఫీస్ సమీపాన బస్ షెల్టర్‌లో మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు అందించిన సమాచారంతో కుటుంబసభ్యులు సురేశ్ మృతదేహాన్ని గుర్తించారు. వడదెబ్బకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు.