News November 30, 2024
GNT: ‘పవన్‌కి ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉంది’

బియ్యం అక్రమ రవాణాపై పవన్ చొరవ సంతోషకరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి.. ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉందన్నారు. మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.
Similar News
News December 28, 2025
గుంటూరు జిల్లాలో ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్‌పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్‌గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
News December 28, 2025
ఆ అధికారుల చొరవతో గుంటూరు జిల్లా శుభిక్షం

2025లో గుంటూరు జిల్లా వరుస తుఫాన్లు, ప్రమాదాలు, ప్రకృతి వపత్తులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.
సమర్థవంతమైన పాలనతో వాటి నుంచి జిల్లాను సురక్షితంగా నడిపించిన నలుగురు అధికారుల పాత్ర కీలకంగా నిలిచింది. అప్పటి కలెక్టర్ నాగలక్ష్మి, SP సతీష్ కుమార్‌తో పాటు ప్రస్తుత కలెక్టర్ తమీమ్ అన్సారియా, SP వకుల్ జిందల్ సమన్వయంతో తీసుకున్న చర్యలతో జిల్లా శుభిక్షంగా ఉందని ప్రజలు అంటున్నారు.
News December 28, 2025
2025లో గుంటూరు జిల్లాను ఇవి వణికించాయి

2025లో గుంటూరు జిల్లా వరుస విపత్తులు, ప్రమాదాలతో అల్లకల్లోలంగా మారింది. తురకపాలెంలో అనుమానాస్పద వ్యాధితో 30మంది మృతి చెందగా, కలరా, డయేరియా వ్యాప్తితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 120 మందికిపైగా చికిత్స పొందారు. మోంథా తుఫాను, కృష్ణా వరదలతో వందల గ్రామాలు ప్రభావితమయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజీ సమస్యలు, కార్పొరేషన్ విస్తరణపై వివాదాలు ప్రజలను కలవరపెట్టాయి.


