News September 12, 2025

GNT: పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శుక్రవారం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఎమ్మెస్సీ సోషల్ సైన్స్ & అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ సైకాలజీ తదితర కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్‌కు ఆసక్తి ఉన్నవారు రూ.1860 ఫీజు చెల్లించి, ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Similar News

News September 12, 2025

ఏనుమాముల మార్కెట్‌యార్డులో ఈవీఎంల పరిశీలన

image

వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs)ను జిల్లా కలెక్టర్ సత్య శారదా పరిశీలించారు. ఈ తనిఖీలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీలు, నిల్వ విధానం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. పారదర్శకతను కాపాడుతూ ఎన్నికల పక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే ఈ తనిఖీ లక్ష్యమని తెలిపారు.

News September 12, 2025

కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

News September 12, 2025

KMM: సాయిరాం ఆసుపత్రిపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం: డా.సునీల్

image

సాయిరాం ఆస్పత్రిపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని డా.జంగాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇటీవల తమ ఆసుపత్రిలో 13 ఏళ్ల బాలుడు కాలేయం క్షీణత వ్యాధి సమస్యతో ప్రాణాపాయస్థితిలో చేరాడని చెప్పారు. ముందుగా బాలుడికి పసర నాటువైద్యం వాడడంతో మూత్రపిండాల వైఫల్యమైందని, చివరి ప్రయత్నంగా తమ ఆసుపత్రికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు.