News December 24, 2025

GNT: బస్సు నడుపుతుండగా గుండెనొప్పి.. 68 మందిని కాపాడాడు

image

పెదనందిపాడు మండలం వరగాని వద్ద ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి చూపారు. పర్చూరు నుంచి గుంటూరు వెళ్తుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి నిలిపివేశారు. దీంతో బస్సులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను స్థానిక ఆలీ క్లినిక్‌కు, అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News December 25, 2025

విశాఖలో అమెజాన్ విస్తరణ.. 850 మందికి జాబ్స్!

image

AP: విశాఖలో తమ కార్యకలాపాలను అమెజాన్ విస్తరిస్తోంది. పెందుర్తి వద్ద రెండేళ్ల క్రితం డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆ సంస్థ ప్రారంభించింది. అక్కడ 400 మంది పని చేస్తున్నారు. లైసెన్స్ ముగియడంతో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(STPI) వద్ద రీ రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని విస్తరించి 850 మందిని నియమించుకోనుందని IT వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో ₹9,740 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాయి.

News December 25, 2025

తిరుమలలో రామానుజాచార్యుల పరీక్ష

image

తిరుమల క్షేత్రం వైష్ణవమా? శైవమా? అనే సందిగ్ధత నెలకొన్నప్పుడు రామానుజులు ఓ పరీక్ష నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి ముందు శంఖుచక్రాలను, త్రిశూల డమరుకాలను ఉంచి తలుపులు మూశారు. మరుసటి రోజు ఉదయం తలుపులు తీసి చూడగా, శ్రీవారు శంఖుచక్రాలు ధరించి విష్ణురూపంలో దర్శనమిచ్చారు. ఈ ఘట్టంతో తిరుమల వైష్ణవ క్షేత్రమని నిరూపితమైంది. రామానుజుల కృషితో తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.

News December 25, 2025

తిరుపతి జిల్లాకు రూ.58.39 కోట్ల విడుదల

image

తిరుపతి జిల్లాలో పల్లె పండగ నిధులు రూ.58.39 కోట్లు విడుదలయ్యాయి. CCరోడ్ల నిర్మాణానికి రూ.41.50కోట్లు, బీటీ రోడ్లకు రూ.2.88కోట్లు, పశువుల షెల్టర్లకు రూ.6.14కోట్లు, కంపోస్టు గుంతలకు రూ.1.25కోట్లు, ప్లాంటేషన్‌కు రూ.0.75 కోట్లు, ఇతర పనులకు రూ.5.87 కోట్లు ఇచ్చారు. గతంలో రూ.60 కోట్లు విడుదల చేయగా మొత్తంగా జిల్లాకు రూ.118.93 కోట్లు వచ్చాయి. పల్లెపండగ-2.0కు రూ.120 కోట్ల మేర పనులకు అనుమతులు కేటాయించారు.