News April 9, 2026
GNT: బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నవ బాలయ్య

ప్రముఖ నటుడు, నిర్మాత మన్నవ బాలయ్య గుంటూరు జిల్లా చావపాడులో 1930 ఏప్రిల్ 9న జన్మించారు. ఇంజినీరింగ్ చదివిన ఆయన 1958లో ‘ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. తన కెరీర్‌లో 350కి పైగా విభిన్న చిత్రాల్లో నటించారు. అమృతా ఫిలిమ్స్ సంస్థను స్థాపించి ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించారు. అనారోగ్యంతో తన 92వ పుట్టినరోజైన 2022 ఏప్రిల్ 9న ఆయన మృతి చెందారు.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.