News January 16, 2025

GNT: భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు

image

భారత సైనిక వ్యవస్థలో నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది.1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1999 కార్గిల్ ఇలా ప్రతి యుద్ధంలో ఈ గ్రామ సైనికులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తతు తీసుకొని గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మించింది.

Similar News

News January 7, 2026

నేడు గుంటూరులో మంత్రి అచ్చెన్నాయుడు ప‌ర్య‌ట‌న‌

image

రాష్ట్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. చుట్టుగుంట‌లోని వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, క‌మీష‌న్ ఏజెంట్స్, అధికారుల‌తో మంత్రి స‌మావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజ‌న్‌లో మిర్చి యార్డ్‌లో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా, మిర్చి ధ‌ర‌లు ప‌త‌న‌మ‌వ్వకుండా అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై మంత్రి చ‌ర్చించ‌నున్నారు.

News January 7, 2026

GNT: స్పెషల్ ఎట్రాక్షన్‌గా ‘సరస్ అక్క’

image

ఈ నెల 8 నుంచి గుంటూరు వేదికగా జరగనున్న సరస్ (సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన, అమ్మకంతో గుంటూరు మిర్చి ఘాటు మరింత బలంగా తాకనుంది. గుంటూరులో మొదటిసారిగా ఈ ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మిర్చికి ప్రసిద్ది కావడంతో సరస్ కార్యక్రమానికి ‘మిర్చి మస్కట్’ రూపొందించారు. ఈ మస్కట్ కి ‘సరస్ అక్క’ అని నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రదర్శన ప్రారంభించనున్నారు.

News January 6, 2026

ANU వ్యాయామ విద్య పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 20 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 21వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.