News October 22, 2025
GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.
Similar News
News October 22, 2025
లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి: కలెక్టర్

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు, జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంటలు రక్షించుకునే విధంగా రైతులకు తగు సూచనలు జారీ చేయాలన్నారు. వాగులు, నదులు దాటుటకు, ఈదుటకు ప్రయత్నం చేయవద్దన్నారు.
News October 22, 2025
కార్తీక మాసం: తొలి రోజున ఏం చేయాలంటే?

కార్తీక మాసంలో తొలి రోజు చాలా పవిత్రమైంది. ఈ శుభారంభం రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేసి శుచిగా ఉండాలి. సమీపంలోని దేవాలయానికి వెళ్లి, శివుడిని దర్శించుకోవాలి. అక్కడ కార్తీక వ్రతం పాటించాలని సంకల్పం చెప్పుకోవాలి. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా భగవంతుడిని ప్రార్థించాలి. అనంతరం ఆలయంలో ఉంచే ఆకాశదీపాన్ని దర్శించుకోవడం మంచి ఆచారం. దీనివల్ల శుభం కలుగుతుందని నమ్మకం.
News October 22, 2025
వాడిన నూనెతో వంట.. నో చెప్పాల్సిందే!

చాలామంది ఇంట్లో పూరీలు, పకోడీలు వేయించాక అదే నూనెను వడకట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం చూస్తుంటాం. అయితే ఇలా వేయించిన నూనెను మళ్లీ పప్పు తాలింపు లేదా కూరలు వండేందుకు వాడటం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి చేయడంతో నూనెలో హానికరమైన రసాయనాలు (ఫ్రీ రాడికల్స్) ఏర్పడతాయని, ఇది ఉపయోగిస్తే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. SHARE IT