News September 21, 2025

GNT: మసకబారుతున్న ANU ప్రతిష్ట

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రతిష్ఠ రోజురోజుకు పడిపోతోంది. ఎంఎస్సీ బోటనీలో 88 మందికి 24 మందే ఉత్తీర్ణత సాధించగా, మీడియా మేనేజ్‌మెంట్‌లో నలుగురిలో ఇద్దరు మాత్రమే పాసయ్యారు. విద్యా అంశాలపై కాకుండా అధ్యాపకులు పరిపాలనపై దృష్టి పెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వం సమర్థవంతమైన వీసీని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో కంటే యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్‌ 24 స్థానాలు తగ్గింది.

Similar News

News September 21, 2025

RDT సేవలపై ఆందోళన వద్దు: మంత్రి లోకేశ్

image

మంత్రి లోకేశ్‌తో ఆర్డీటీ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సమావేశమయ్యారు. RDTకి FCRAపై రెన్యువల్‌పై చర్చించారు. ‘ఎవరూ ఆందోళన చెందొద్దు. RDT సేవలు యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నాం. సమస్యకు శాశ్వత పరిష్కరాం చూపుతాం’ అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలతో సేవా బంధం పెనవేసుకున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని పేర్కొన్నారు.

News September 21, 2025

ఇజ్రాయెల్ దాడులు.. ఒక్క రోజే 91 మంది మృతి!

image

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒక్క రోజే 91 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇళ్లు, షెల్టర్లు, వాహనాలపై దాడులు జరిగినట్లు తెలిపింది. పేలుడు పదార్థాలు నింపిన రోబోలను ఇజ్రాయెల్ దళాలు వాడుతున్నట్లు పేర్కొంది. గత 2 వారాల్లో 20 టవర్ బ్లాక్‌లపై అటాక్స్ జరిగాయని, లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. అటు యుద్ధం ఆపేయాలంటూ వేలాది మంది టెల్ అవీవ్‌లో నిరసనలకు దిగారు.

News September 21, 2025

వరంగల్: ఎడ్లబండి ఏడుస్తోంది..!

image

కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతోంది. దీంతో వ్యవసాయానికి వాడే పనిముట్లను పక్కనబెట్టి యంత్రాలను వాడుతుండటంతో వాటినే నమ్ముకొని బతుకుతున్న వడ్రంగి వృత్తి వారికి ఉపాధి లేకుండా పోతోంది. దీంతో ఎడ్ల బండ్లు, నాగళ్లు కనుమరుగయ్యాయి. గ్రామాల్లో ఎక్కడో ఒకచోట మాత్రమే ప్రస్తుతం ఎడ్లబండ్లు కనిపిస్తున్నాయి. మానుకోట జిల్లా కౌసల్యాదేవిపల్లిలో ఓ రైతన్న ఎడ్లబండిని తీసుకెళ్తుండగా Way2News చిత్రీకరించింది.