News December 3, 2025
GNT: మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్‌లతో మహిళలపై దుష్ప్రచారం

మార్ఫింగ్ ఫొటోలు, ఫోన్ నంబర్‌లతో కాల్ గర్ల్స్ అంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని బాధిత మహిళలు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ నంబర్ పెట్టడంతో ప్రతిరోజూ తమకు రకరకాల నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరువుకి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ మేరకు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు.
Similar News
News December 4, 2025
WGL: మొక్కజొన్న క్వింటాకి రూ.2,020

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధర నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935, మంగళవారం రూ.1,905, బుధవారం రూ.1,945 ధర వచ్చింది. నేడు రూ.2,020 అయింది. దీంతో మొక్కజొన్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, క్వింటా పచ్చి పల్లికాయకు నిన్న రూ.5,400 ధర రాగా, నేడు రూ.4,700 అయినట్లు వ్యాపారులు తెలిపారు.
News December 4, 2025
కారంపూడి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

కారంపూడి విద్యుత్ ఏఈ పెద్ద మస్తాన్ రూ.25 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కారంపూడికి చెందిన వలీ ఇంజినీరింగ్ వర్క్స్ వారికి అదనపు మీటర్లు కేటాయించడానికి డబ్బులు అడగడంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ బాధితుడు వలి నుంచి ఏఈ రూ.25,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
News December 4, 2025
నైపుణ్య లోటుపై లోక్‌సభలో ఖమ్మం ఎంపీ ప్రశ్న

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు లోక్‌సభలో వివరాలు కోరారు. కేవలం 3% మంది కార్మికులకే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతికతల వినియోగ వివరాలు తెలపాలని కోరారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ఎఫ్‌ఐసీఎస్‌ఐ ద్వారా చర్యలు తీసుకుంటూ 60 విభాగాల్లో ఉపాధి కల్పిస్తున్నట్లు వివరించారు.


