News October 11, 2025

GNT: మిర్చీ యార్డులో 41,281 మిర్చి టిక్కీల అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 42,595 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 41,281 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 11,715 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.

Similar News

News October 11, 2025

చిత్రకారులకు యిదే మా ఆహ్వానం: గజల్ శ్రీనివాస్

image

వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అమరావతిలోని శ్రీసత్యసాయి స్పిరిచువల్ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారులు తమ ప్రతిభను ఆవిష్కరించడానికి వేదికగా మన అమరావతి పేరుతో చిత్రకళాప్రదర్శన ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు.

News October 11, 2025

చేబ్రోలులో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు

image

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్‌‌లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News October 10, 2025

రోడ్డు ప్రమాదం కారణాలను నమోదు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మూల కారణాలను తెలుసుకొని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన ఐ-ఆర్ఏడీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో నివారణకు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.