News March 16, 2025
GNT: మేయర్ ఆకస్మిక నిర్ణయంపై వైసీపీలో అసంతృప్తి

మేయర్ మనోహర్ రాజీనామా నిర్ణయంపై వైసీపీలో కూడా కొంత అసంతృప్తికి దారితీసినట్లు సమాచారం. వైసీపీకి ఉన్న 23 మంది కార్పొరేటర్లతో ఆయన మాట మాత్రం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా నగర అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వలేదని సమాచారం. టీడీపీ అవిశ్వాసం పెట్టడానికి ముందే మేయర్ రాజీనామా చేయడంతో తదుపరి చర్యలపై ఆ పార్టీ నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.
Similar News
News March 17, 2025
GNT: ఇన్‌ఛార్జ్ మేయర్‌గా ఎవరిని నియమిస్తారు.?

గుంటూరు మేయర్ మనోహర్ రాజీనామా నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌ను ఇన్‌ఛార్జి మేయర్‌గా ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉండటం, ఒకరు వైసీపీ, మరొకరు టీడీపీ తరుఫున ఉండటంతో ఈ పదవి ఎవరికి ఇస్తారన్నదీ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ మేయర్‌గా తొలుత డైమండ్ బాబు నియమితులవ్వగా.. అనంతరం షేక్ సజీల ఎంపికయ్యారు. అయితే సీనియారిటీ ప్రాతిపదికన తమకే అవకాశం ఇవ్వాలని డైమండ్ బాబు గ్రూప్ వాదిస్తోంది.
News March 17, 2025
గుంటూరు: 10మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

గుంటూరు మండల విద్యాశాఖ అధికారి ఎస్.ఎం.ఎం ఖుద్దూస్ 10 మంది ఉపాధ్యాయులకు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పదోతరగతి ఇన్విజిలేషన్ డ్యూటీ రిపోర్ట్‌లో నిర్లక్ష్యం చేయడంతో ఆ ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక ఆదేశానుసారం నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. తాఖీదు అందిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని ఖుద్దూస్ సూచించారు.
News March 17, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వికేంద్రీకరణ: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(PGRS)ను ఈ సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో సమర్పించుకోవచ్చని అన్నారు. ప్రజలకి పాలనను మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.