News March 28, 2025
GNT: మైనర్ బాలికతో ప్రేమ పెళ్లి.. పోక్సో కేసు నమోదు

బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువకుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువకుడిపై పట్టాభిపురం పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది. ఇద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. ఆ మైనర్ బాలిక మరో వ్యక్తితో చాటింగ్ చేస్తుండటంతో ఆ కుటుంబాల్లో గొడవలు జరిగాయి. దీంతో వారు స్టేషన్ మెట్లు ఎక్కడంతో పెళ్లి జరిగి 8 నెలలైందని పోలీసులు గుర్తించారు.
Similar News
News March 31, 2025
గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
News March 31, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ ముఖ్య సూచనలు

రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో సోమవారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (PGRS) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కావున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News March 30, 2025
తుళ్లూరు: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం

ఏపీలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు పీ-4 కార్యక్రమం ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 20 శాతం మంది నిరుపేదలకు ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది సహాయం చేసేందుకే దీనిని చేపట్టనున్నారు. కార్యక్రమంలో దాదాపు 14వేల మంది పాల్గొంటారు. పేదలు, దాతలు, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయి.