News November 17, 2025
GNT: యోగా పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
Similar News
News November 17, 2025
పొగమంచులో నెమ్మదిగా వెళ్లండి: సీపీ

శీతాకాలంలో చలి, పొగమంచు తీవ్రత పెరిగినందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, వాహనదారులు లైటింగ్ కండిషన్ చూసుకోవాలని, తక్కువ వేగంతో ఒకే లైన్‌లో ప్రయాణించాలని, ఓవర్ టేక్ చేయవద్దని ఆయన సూచించారు. సురక్షిత ప్రయాణం కోసం జాగ్రత్తలు పాటించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

కృష్ణా: SP కార్యాలయంలో ‘మీకోసం’.. 37 అర్జీలు దాఖలు

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో మొత్తం 37 అర్జీలు అందినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వాటిని కూలంకషంగా పరిశీలించి, సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు బదిలీ చేసినట్లు, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.