News November 15, 2025

GNT: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు

image

రైతులకు ధాన్యం విక్రయాన్ని సులభం చేస్తూ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై 7337359375 నంబర్‌కు “Hi” పంపితే వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు అమ్మదలచిన ధాన్య రకం, బస్తాల సంఖ్య, దగ్గర్లోని కేంద్రం, తేదీ-సమయం వివరాలు పంపగానే స్లాట్ ఆటోమేటిక్‌గా బుక్ అవుతుంది. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేసే దిశగా ఈ చర్య ముందడుగుగా రైతులు భావిస్తున్నారు.

Similar News

News November 15, 2025

వేములవాడలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

image

దక్షిణ కాశీ వేములవాడ క్షేత్రంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుసగా 25వ రోజు కార్తీక దీపోత్సవంలో భాగంగా భక్తులు భీమేశ్వరాలయం ఆవరణలో దీపాలను వెలిగించారు. కార్తీక దీపాలతో ఆలయ ఆవరణ కాంతులీనింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆలయ ఈ రాజేష్, ఏఈఓ శ్రావణ్ ప్రసాదం, వాయనం అందజేశారు.

News November 15, 2025

రేపు బాపట్ల జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి 11.45కి సూర్యలంక గోల్డెన్ సాండ్ బీచ్ చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి 7.55కి తిరుగు ప్రయాణం అవుతారు. పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు.

News November 15, 2025

చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

image

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.