News April 8, 2025
GNT: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి నుంచి శుద్ధపల్లికి వెళ్లే దారిలో రేపల్లె-సికింద్రాబాద్ వెళ్లే ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. తెలుపు, నీలం రంగు గళ్ల చొక్కా, నీలం రంగు లుంగీ ధరించాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 16, 2025
GNT: బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడిగింపు

ఫిరంగిపురం PSలో నమోదైన కేసులో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు నరసరావుపేట కోర్టు రిమాండ్‌ను ఈ నెల 28 వరకు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అనిల్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అనిల్ రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
News April 16, 2025
గుంటూరు జిల్లాపై కందుకూరి వీరేశలింగం ప్రభావం

తెలుగు సామాజిక సంస్కర్త కందుకూరి వీరేశలింగం గుంటూరు జిల్లాపై గొప్ప ప్రభావం చూపారు. 1902లో ఉన్నవ దంపతులు గుంటూరులో నిర్వహించిన మొదటి వితంతు పునర్వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. బాలికల విద్య, స్త్రీ సాధికారత కోసం పాఠశాలలు స్థాపించడంతోపాటు, బాల్య వివాహాలు, వరకట్నం వంటి సంప్రదాయాలను వ్యతిరేకించారు. ఆయన సంస్కరణలు నేటికీ ప్రాంతీయ సామాజిక వికాసానికి దోహదపడుతున్నాయి.
News April 16, 2025
మే 2న అమరావతికి ప్రధాని మోదీ రాక

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన మే 2వ తేదీన ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 3ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తిచేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.