News July 21, 2024

GNT: లక్ష కడితే.. రూ.10 లక్షలు చెల్లిస్తామని మోసం

image

రూ. లక్ష కడితే.. 10 లక్షలు చెల్లిస్తామంటూ విజయవాడకు చెందిన ఓ ముఠా గుంటూరుకు చెందిన సరస్వతిని మోసం చేసింది. పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన నాగరాజు, మరి కొంతమంది రూ.లక్షకు పది లక్షల చొప్పున చెల్లిస్తామంటూ సరస్వతి అనే మహిళని నమ్మబలికారు. దీంతో మహిళ రూ.36 లక్షలు వారికి ఇచ్చింది. చివరికి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 29, 2024

గుంటూరు: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్

image

బోరుగడ్డ అనిల్‌కు మరో 14 రోజులు రిమాండ్‌ను  గుంటూరు జిల్లా కోర్టు పొడిగించింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర దూషణలపై కేసులో బోరుగడ్డ అనిల్‌కు ఉత్తర్వులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆయనను మళ్లీ రాజమండ్రి జైలుకు పట్టాభిపురం పోలీసులు తరలించారు. కాగా ఇప్పటికే అనిల్ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు.

News November 29, 2024

రాజధానిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

image

రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ కానుంది. అమరావతి ప్రాంతంలో గతంలో పలు భూకేటాయింపులపై సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ముఖ్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, దుర్గేశ్, టీజీ భరత్, సంధ్యారాణి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

News November 29, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.15 గంటలకు నారావారిపల్లె నుంచి సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనపై తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. 3.30 గంటలకు రెవెన్యూ శాఖపై సమీక్ష చేసిన అనంతరం గ్రామ/వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేయనున్నట్లు చెప్పారు.