News September 1, 2025

GNT: లారీ చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటూరు మిర్చియార్డులో విషాదం చోటుచేసుకుంది. యార్డులోకి వెళ్తున్న లోడు లారీ చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 1, 2025

రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు 7వ స్థానం

image

రాష్ట్ర EPTSలో గుంటూరు జిల్లా 7వస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 39,349 డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయగా, అందులో జీవోలు 1969, మెమోలు 800, సర్క్యులర్లు 1291, లేఖలు 14,975 ఉన్నాయి. గుడ్‌ గవర్నెన్స్‌ కోసం EPTS కీలకమని, వెనుకబడిన జిల్లాలు తక్షణం పనితీరు మెరుగుపరచాలని ప్రభుత్వం ఆదేశించింది.

News September 1, 2025

సిరిపురంలో రికార్డు సృష్టించిన లడ్డూ వేలం

image

మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలంపాట రికార్డు సృష్టించింది. ఈ లడ్డూ రూ. 5,01,000లకు అమ్ముడై గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికింది. ప్రతి సంవత్సరం జరిగే వినాయక మహోత్సవాల్లో లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది సిరిపురం గ్రామానికి చెందిన కడియాల పరమేశ్వరరావు (అశోక్) భక్తిశ్రద్ధలతో లడ్డూను దక్కించుకున్నారు.

News August 31, 2025

GNT: ‘3న ఉమెన్స్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలు’

image

గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికల కోసం ఇంటర్వ్యూ జరగనుంది. హోమ్ సైన్సెస్‌లో 50% మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం కలిగిన వారు ఇంటర్వూలకు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.ఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.