News December 14, 2025

GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

image

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

Similar News

News December 15, 2025

శబరిమలలో గుంటూరు జిల్లా యువకుడి మృతి

image

కొల్లిపర మండలం చెముడుబాడు పాలెం గ్రామానికి చెందిన చైతన్య (22) అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళ వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. కన్య స్వామిగా వెళ్లిన ఆయన 12వ తేదీన మరణించగా, అయ్యప్ప ఆలయ కమిటీ ప్రత్యేక వాహనంలో చైతన్య మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News December 15, 2025

ఈ నెల 18 నుంచి యువజనోత్సవాలు: కలెక్టర్

image

రాష్ట్ర స్థాయి యువజనోత్సవం, ఆంధ్ర యువ సంకల్ప్–2K25 కార్యక్రమాన్ని ఈ నెల 18,19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సేవల శాఖ తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు లోకేశ్, రాం ప్రసాద్ రెడ్డి అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని అన్నారు.

News December 15, 2025

ఆ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామయోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. పీఎం ఆదర్శ గ్రామయోజన పథకంపై సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 500, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్ కులాల గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశామని చెప్పారు.