News December 1, 2025
GNT: విడదల రజిని చూపు ఎటువైపు..?

మాజీ మంత్రి విడదల రజిని వైసీపీతో బంధం సడలిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పెంచుతోంది. గుంటూరు పశ్చిమ ఓటమి అనంతరం చిలకలూరిపేటలో చురుగ్గా ఉన్న ఆమెను రేపల్లెకు వెళ్లమన్న పార్టీ అధినేత ఆదేశం అసంతృప్తికి కారణమైనట్లు టాక్. దీంతో ఆమె త్వరలో పార్టీ మారే అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది.
Similar News
News December 1, 2025
జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

జి.జి.కళాశాలలో శనివారం నుండి మొదలైన (స్వ.ప్ర.) డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. సోమవారం1664 మంది విద్యార్థులకుగాను 57మంది గైర్హాజరయ్యారు.1607మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తదితర పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.ఎస్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.
News December 1, 2025
ఏపీలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి కందుల

సినిమా షూటింగ్‌లు, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త అధ్యాయం రచిస్తున్నామని మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. సోమవారం ముంబయిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025’లో ఆయన ఈ విషయం తెలిపారు. ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించడానికి తమ ప్రభుత్వం వేగంగా కృషి చేస్తుందని మంత్రి వెల్లడించారు.
News December 1, 2025
వెన్నెముక కింద డింపుల్స్ ఎందుకుంటాయంటే?

వెన్నెముక దిగువ భాగంలో డింపుల్స్ ఎందుకు ఉంటాయో వైద్యులు వివరించారు. వీటిని మహిళల్లో ‘వీనస్ డింపుల్స్’, పురుషుల్లో ‘అపోలో డింపుల్స్’ అంటారు. ‘తుంటి ఎముక చర్మాన్ని లిగమెంట్ లాగడం వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి ఆడవారిలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది సహజ శరీర నిర్మాణం మాత్రమే. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలుండవు. వెన్నెముక మధ్యలో ‘శాక్రల్ డింపుల్’ ఉంటే మాత్రం వైద్య పరీక్షలు చేయించుకోవాలి’ అని తెలిపారు.


