News January 18, 2026

GNT: విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నిర్వహించనున్న 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను http://anucde.info/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని వర్శిటీ వర్గాలు సూచించాయి. కోర్సువారీగా టైం టేబుల్ వివరాలకై https://anucde.info/Dec2025TimeTable.pdf చూడవచ్చని ఓ ప్రకటనలో అధ్యాపకులు తెలిపారు.

Similar News

News February 14, 2026

అగరిపల్లి చెరువులో మృతదేహం కలకలం

image

అగరిపల్లిలోని స్థానిక చెరువులో శనివారం వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఘటనా స్థలం వద్ద ఏలూరుకు చెందిన ప్రముఖ మానవతావాది ఆలపాటి నాగేశ్వరరావు ద్విచక్ర వాహనం లభించడంతో కలకలం రేగింది. గత సోమవారం నుంచి ఆయన కనిపించకుండా పోయినట్లు సమాచారం. మృతదేహం నాగేశ్వరరావుదేనా కాదా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News February 14, 2026

నల్గొండ: గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి

image

చిట్యాల మండలం నేరడ పంచాయతీ కార్యదర్శి మేకల వెంకటేశ్వరరావు (61) ఇవాళ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. హైదరాబాద్ ఇమ్లిబన్ బస్టాండ్‌లో ఈ ఘటన జరగ్గా పోలీసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే మండలంలోని ఏపూరులో విధులు నిర్వహించారు. ఈ సెప్టెంబర్‌లో రిటైర్డ్ కావలసి ఉంది. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, పీఎస్‌లు సానుభూతిని తెలిపారు.

News February 14, 2026

NPCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గలవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2024, 2025, 2026 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.74,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://npcilcareers.co.in