News February 11, 2026

GNT: సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేతివాటం..!

image

గోల్డ్ షాప్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న వ్యక్తి డైమండ్ నెక్లెస్ లింకులు విడతల వారీగా చోరీ చేసిన ఘటన‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రోడ్డులోని ఓ షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూ.2లక్షల విలువ చేసే 12 గ్రాముల డైమండ్ నెక్లెస్ లింకులు మూడుసార్లు చోరీ చేశాడు. బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Similar News

News April 13, 2026

HYD: కన్నీటి కడలిలో ఎదురీదిన సృజన

image

రాజేంద్రనగర్ మండలం పద్మశాలిపురం బస్తీకి చెందిన గుంటి సృజన కష్టాల మధ్య అద్భుతం చేసి చూపింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రిని ఆస్పత్రిలో చూసుకుంటూనే ఇంటర్ పరీక్షలకు హాజరైంది. కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నా ఆమె ధైర్యం కోల్పోలేదు. బైపీసీలో 440 మార్కులకు 427 మార్కులు సాధించి తండ్రి ముఖంలో వెలుగు నింపాలనుకుంది. కానీ ఈ లోపే తండ్రి కాలంచేయడంతో మార్కులు చూసుకుంటూ తండ్రిని తలచుకుని కన్నీరు పెట్టుకుంది.

News April 13, 2026

కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

image

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.

News April 13, 2026

మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్?

image

‘వృషకర్మ’ చిత్రంతో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో హీరోగా తన 25వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది లవ్&మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాలీవుడ్ టాక్.