News August 17, 2024

GNT: 19 వరకు దరఖాస్తులకు గడువు

image

గుంటూరు మెడికల్ కాలేజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు, 19న కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఏపీ పారామెడికల్ బోర్డు ఆదేశాల మేరకు ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 27వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేవారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.

Similar News

News December 4, 2025

దుగ్గిరాలలో క్వింటాల్ పసుపు ధర ఎంతంటే.!

image

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటాల్ పసుపు రూ.12,500 గరిష్ఠ ధర పలికింది. యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు కొమ్ముల ధర రూ.8,500 నుంచి రూ.12,500 పలకగా కాయ రకం పసుపు ధర రూ. 8,550 నుంచి రూ.12,500 వరకు పలికినట్లు అధికారులు తెలిపారు. రైతులు యార్డుకు తెచ్చిన పసుపు పంటలో 684 బస్తాలను వ్యాపారులకు విక్రయించారు.

News December 4, 2025

నేడు గుంటూరు జిల్లాకు లంకా దినకర్ రాక

image

20 సూత్రాల కార్యక్రమం ఛైర్మన్ లంకా దినకర్ గురువారం జిల్లాకు రానున్నారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. 4వ తేది ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆరోగ్యం, విద్యా రంగాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల అమలు పురోగతి, అమృత్ (AMRUT) అమలు స్థితి, జల్ జీవన్ మిషన్ పురోగతి, PM సూర్యాఘర్, కుసుమ్ పథకాలపై సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్తారన్నారు.

News December 3, 2025

NAKSHA కింద రూ.125 కోట్లు మంజూరు: పెమ్మసాని

image

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా APకు కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. మోదీ దూరదృష్టితో, CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్  నాయకత్వంలో AP పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ‘X’ లో ట్వీట్ చేశారు.