News August 17, 2024
GNT: 19 వరకు దరఖాస్తులకు గడువు

గుంటూరు మెడికల్ కాలేజీ పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల దరఖాస్తులు, కౌన్సిలింగ్ తేదీల్లో మార్పులు జరిగాయి. గతంలో ఆగస్టు 6 వరకు దరఖాస్తులు, 19న కౌన్సెలింగ్ జరుగుతుందని ప్రకటించారు. ఏపీ పారామెడికల్ బోర్డు ఆదేశాల మేరకు ఈనెల19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 27వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తాజాగా స్పష్టం చేవారు. ఈ విషయాన్ని దరఖాస్తుదారులు గమనించాలని కోరారు.
Similar News
News September 17, 2025
వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
News September 17, 2025
రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.