News August 31, 2025

GNT: ‘3న ఉమెన్స్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికలు’

image

గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 3న ఉదయం 10 గంటల నుంచి గెస్ట్ ఫ్యాకల్టీ ఎంపికల కోసం ఇంటర్వ్యూ జరగనుంది. హోమ్ సైన్సెస్‌లో 50% మార్కులతో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం కలిగిన వారు ఇంటర్వూలకు అర్హులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.ఆర్ జ్యోత్స్నకుమారి తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Similar News

News August 31, 2025

గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

గుంటూరులో ఆదివారం నాటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.200, చికెన్ విత్ స్కిన్ కేజీ రూ.180గా విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చికెన్‌కి ఉన్న డిమాండ్‌ని బట్టి ధరల్లో రూ. 20 నుంచి రూ.30 వ్యత్యాసం కూడా కనిపిస్తుంది. మరి ఈరోజు మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.

News August 30, 2025

గుంటూరు జిల్లా బార్లకు వేలంపాట

image

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో శనివారం బార్లకు వేలంపాట నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 42 బార్లకు దరఖాస్తులు అందాయని, 10 కల్లుగీత కార్మికులకు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. వేలంలో సుమారు 200 మంది పాల్గొన్నారు.

News August 30, 2025

గుంటూరు: MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ రిలీజ్‌

image

ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరి. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, బ్యాంకింగ్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం, బిజినెస్‌ ఎనాలిటిక్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ వంటి 8 స్పెషలైజేషన్‌లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్‌ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.