News October 29, 2025
GNT: 39 మంది గర్భిణులను జీజీహెచ్‌కు తరలింపు

‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. సోమవారం, మంగళవారం రోజుల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 39 మంది గర్భిణులను సురక్షితంగా GNT GGHకు తరలించారు. తరలించిన గర్భిణులలో అచ్చంపేట, కారంపూడి, పెదకూరపాడు, దుగ్గిరాల ప్రాంతాలకు చెందిన మహిళలు ఉన్నారు. 24 గంటల విద్యుత్‌కు అంతరాయం కలగకుండా, 8 జనరేటర్లకు సరిపడా ఇంధనాన్ని సిద్ధం చేశారు.
Similar News
News October 29, 2025
ఖమ్మం: MPని లైట్ తీసుకుంటున్నారా..!

ఖమ్మంలో ముగ్గురు మంత్రుల మధ్య MP రఘరాంరెడ్డి ప్రభావం చూపలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. మంగళవారం జరిగిన దిశ సమీక్ష సమావేశామే ఇందుకు ఉదాహరణగా ఉటంకిస్తున్నారు. మీటింగ్‌కు MLAలు, జిల్లా ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. వైరా, సత్తుపల్లి MLAలు తమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ MP సమీక్షకు హాజరుకాలేదని సమాచారం. మంత్రులను మచ్చిక చేసుకోవడంలో అధికారులు క్యూ కడుతున్నారే తప్పా ఎంపీని పట్టించుకోవడం లేదని టాక్.
News October 29, 2025
పాలమూరుకు వాతావరణ శాఖ అలెర్ట్… సెల్‌ఫోన్‌లకు సందేశాలు

రాబోయే 3 గంటల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజలకు సెల్‌ఫోన్‌లకు సందేశాల (SMS) ద్వారా అలెర్ట్ జారీ చేస్తోంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
News October 29, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

సోమందేపల్లి(M) నల్లగొండ్రాయునిపల్లి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరులో ఉంటున్న గణేశ్ బంధువు మధుతో కలిసి బైకుపై రామగిరి(M) నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలగమేకలపల్లికి చెందిన జగదీశ్ నాయక్ బైకుపై రోడ్డు దాటుతుండగా గణేశ్ బైక్ ఢీకొట్టాడు. గణేశ్ మృతిచెందగా, మధుకు కాలు విరిగింది. ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.


