News October 9, 2025
GNT: 400 కోట్ల స్కామ్.. జిల్లాలో ఐటీ రైడ్స్

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఐటీ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొన్నేళ్లుగా నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారీ చేస్తున్న పలు పప్పు మిల్లుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ. 400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఐటీ అధికారులు 30తో బృందాలు గుంటూరు, తెనాలి, వినుకొండ, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, ప్రాంతాల్లోని దాల్ మిల్లులు, ఏజెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు చేపట్టారు.
Similar News
News October 9, 2025
అపోలో వర్సిటీ ఘటనపై కేసు నమోదు

చిత్తూరు అపోలో యూనివర్సిటీలోని <<17959171>>గర్ల్స్ టాయిలెట్‌లో<<>> హిడెన్ కెమెరా అమర్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. చెన్నైకి చెందిన ఓ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజినీరింగ్ పనిచేస్తున్న రూబెన్‌గా నిర్ధారించారు. ఈ మేరకు అతని నుంచి పోలీసులు ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 9, 2025
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలి: డీఈవో

విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నేర్చుకున్నది పాఠశాలలో అమలు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
News October 9, 2025
బీఆర్ఎస్ చేసిన చట్టం బీసీలకు ఉరితాడులా మారింది: భట్టి

TG: రాష్ట్రంలో రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా 2018లో BRS చేసిన చట్టం ఇప్పుడు OBCలకు ఉరితాడులా మారిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు అడ్డుకుంటారనే పక్కాగా కులగణన సర్వే చేశామన్నారు. బీసీలకు న్యాయం చేసేందుకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని సంకల్పించినట్లు చెప్పారు. కానీ కోర్టులో కేసులు వేసి బీసీల నోటి కాడ ముద్దను లాక్కుంటున్నారు’ అని ఆరోపించారు.