News January 7, 2026
GNT: BSNL యూజర్లకు శుభవార్త

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GBడేటా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 9, 2026
సీఎం సమీక్షలో పాల్గొన్న గుంటూరు ఎస్పీ

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పరిపాలనపై సోమవారం కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి గుంటూరు నుంచి ఎస్పీ వకుల్ జిందాల్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జాయింట్ కలెక్టర్ అషుతోశ్ శ్రీవాత్సవ కూడా పాల్గొన్నారు. మంత్రులు, కార్యదర్శులతో కలిసి సీఎం పలు అంశాలపై చర్చించారు.
News February 9, 2026
‘ట్రీస్కేప్స్ 2026’లో ANU ప్రతినిధుల సందడి

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ‘ట్రీస్కేప్స్2026’ అంతర్జాతీయ సదస్సులో ANUబృందం పాల్గొంది. ‘సౌత్ ఏషియన్ ఆగ్రోఫారెస్టీ&ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్ట్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ANU అధ్యాపకులు మనోజ్ రెడ్డి, తన్విక, విద్యార్థుల బృందం హాజరైంది. అటవీసంరక్షణ, వ్యవసాయ రంగాల్లో వస్తున్న నూతన సాంకేతిక మార్పులు, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి చర్చలు జరిపారు.
News February 9, 2026
GNT: నులిపురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (డీ వార్మింగ్ డే)ను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పోస్టర్ ను కలెక్టరేట్‌లో సోమవారం తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. అన్నీ అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల్లో 17వ తేదీన ఉచితంగా ఇవ్వబడే అల్బెండజోల్ 400 మిల్లీ గ్రాముల మాత్ర ద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు.


