News January 10, 2026
GNT: CRDAలో ఉద్యోగ అవకాశాలు

రాజధాని ప్రాంతంలో CRDAలో పనిచేయుటకు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తాడికొండ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆసక్తి ఉన్న యువతీ, యువకులు తమ వివరాలను గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ నెల 12 లోగా అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు CRDA సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్‌ను సంప్రదించాలని చెప్పారు.
Similar News
News February 1, 2026
గద్వాల: దివ్యాంగుల సంక్షేమానికి కీలక నిర్ణయం-కలెక్టర్

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులైన ఇద్దరి మధ్య జరిగే వివాహాలకు ప్రభుత్వం రూ.2 లక్షలు సహాయం అందజేస్తుందన్నారు. 2026 జనవరి 17 నుంచి వివాహం చేసుకున్న వారికి వర్తిస్తుందన్నారు. అర్హులైన వారు www.epass.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆఫీసులో సమర్పించాలన్నారు.
News February 1, 2026
కేంద్ర బడ్జెట్‌పై కేంద్ర మంత్రి రామ్మోహన్ స్పందన

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయ అధికారులు వివరాలు వెల్లడించారు. 2026-27 కేంద్ర బడ్జెట్ స్థిరమైన ఆర్ధిక విధానంతో పాటు పెట్టుబడులు, సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టడం హర్షణీయం అన్నారు. నూతన ఆదాయపు పన్ను చట్టం, టూరిజం, డేటా సెంటర్లు ఏర్పాటు నిర్ణయాలు బాగున్నాయన్నారు.
News February 1, 2026
ఏపీ ముఖ్యమైన కేటాయింపులు ఇలా..

* అమరావతి రాజధాని అభివృద్ధి(ఏడీబీ నిధులు)- రూ.1,128 కోట్లు
* అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్(జపాన్ నిధులు)- రూ.432 కోట్లు
* గ్రామీణ రహదారులు- రూ.500 కోట్లు
* పట్టణాల్లో తాగు, మురుగు నీటి పారుదల- రూ.800 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం- రూ.155 కోట్లు
* రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం- రూ.350 కోట్లు


