News December 25, 2025

GNT: ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ.!

image

అమరావతి ORR కోసం భూసేకరణకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం ఇప్పటివరకు గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలకు గెజిట్ విడుదల చేసింది. 4 జిల్లాలో మొత్తం 189.90 Km మేర ORR నిర్మించనున్నారు. గుంటూరు జిల్లాలో 67.65Km, పల్నాడులో 17.23Km మేర నిర్మించనున్నారు. ORR ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Similar News

News December 25, 2025

గద్వాల్: రైతు మృతి వదంతులు వ్యాపింప చేయవద్దు- కలెక్టర్

image

మానవపాడు మండలం కలుకుంట్ల రైతు వేదిక వద్ద బుధవారం ఉండవెల్లి మండలం బొంకూరు రైతు జమ్మన్న వృద్ధాప్యం, రక్తపోటు వల్ల గుండెపోటుతో మృతి చెందాడని గద్వాల కలెక్టర్ సంతోష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలను కలెక్టర్ ఖండించారు. జమ్మన్న మొక్కజొన్న ఈనెల 23న కొనుగోలు చేయగా 24న బయోమెట్రిక్స్ కోసం వచ్చి గంటసేపు ఉన్నాడని తెలిపారు. ఆయన మృతిని అధికారులపై నెట్టివేయడం సరైంది కాదన్నారు.

News December 25, 2025

డ్రైవరన్నా గమ్యమే కాదు.. ప్రాణమూ ముఖ్యమే!

image

రోడ్డు <<18667549>>ప్రమాదాల్లో<<>> పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఇలా కారణమేదైనా ప్రయాణికులే బలైపోతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో పొగమంచుతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అందుకే డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పరిమిత వేగంలోనే వాహనాన్ని నడపడం, లాంగ్ జర్నీలో విశ్రాంతి తీసుకోవడం, మధ్యమధ్యలో ముఖం కడుక్కోవటం, ఎర్లీ అవర్స్‌లో వాహనం నడపకపోతే ప్రమాదాలు తగ్గే అవకాశముంటుంది.

News December 25, 2025

శివాజీ ‘దండోరా’ సినిమా రివ్యూ& రేటింగ్

image

కుల వివక్ష, అసమానతల కథాంశంతో ‘దండోరా’ రూపొందింది. పరువు హత్య బాధితులతోపాటు పాల్పడిన కుటుంబాలు అనుభవించే క్షోభను చూపించారు. కుల వివక్షను కొత్త కోణంలో చూపించడంలో డైరెక్టర్ మురళి విజయం సాధించారు. రైతుగా శివాజీ మరోసారి నటనతో మెప్పించారు. బింధుమాధవి, రవికృష్ణ, నవదీప్ పాత్రలు ఆకట్టుకుంటాయి. కథ, పాత్రల మధ్య సంఘర్షణ, BGM ప్లస్. కొన్ని సన్నివేశాలు, ఫస్టాఫ్, రొమాంటిక్ ట్రాక్ మైనస్.
రేటింగ్: 2.75/5