News March 13, 2025
GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.
Similar News
News March 14, 2025
గుంటూరు: లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపాడు రోడ్డులోని ఓ కళాశాల వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొత్తకాలనీ ప్రాంతానికి చెందిన రత్నాకర్(64)బైక్‌పై వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ అతడిని ఢీకొట్టి పైకి ఎక్కింది. దీంతో రత్నాకర్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సింది.
News March 14, 2025
గుంటూరు జిల్లా ఎస్పీ వార్నింగ్

గుంటూరు జిల్లా ప్రజలు స్నేహపూర్వక వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ సూచించారు. ఇతర మతస్థుల వ్యక్తిగత స్వేచ్ఛను, వారి మతాచారాలను గౌరవిస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఆకతాయి చేష్టలకు, అల్లర్లకు తావివ్వకుండా శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చేయాలన్నారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తే చర్యలు తప్పవన్నారు.
News March 13, 2025
తుళ్లూరు: చంద్రబాబును కలిసిన డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్

డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సంబంధించి ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు.