News February 4, 2025
GNT: భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
ఉమ్మగి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కొన్ని రోజులుగా భార్య నవ్యశ్రీని విడిచిపెట్టి తప్పించుకు తిరుగుతున్న భర్త వాసు, ప్రియురాలు గాయత్రితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో భర్త, ప్రియురాలిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. నవ్యశ్రీ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 4, 2025
GNT: నగ్న చిత్రాల పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా.. అరెస్ట్
అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన దేవనాయక్‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు నిడదవోలు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. తన వద్ద యువతి నగ్న చిత్రాలు ఉన్నాయని వాటిని ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. నిందితుడి నుంచి రూ. 1.84 కోట్లు నగదు, ఆస్తులను సీజ్ చేశామన్నారు.
News February 4, 2025
తాడేపల్లి: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్
విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. భయపడవద్దు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.
News February 4, 2025
నులిపురుగుల నివారణ పోస్టర్లు ఆవిష్కరించిన గుంటూరు కలెక్టర్
ఈ నెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం నులిపురుగుల నిర్మూలన పోస్టర్లను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. 1 నుంచి 19సం.ల పిల్లలకు 400mg ఆల్బెండజోల్ బిళ్ళలను చప్పిరించి మింగించాలని, ఒకటి నుంచి 2 సంవత్సరాల పిల్లలకు అరమాత్ర ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మజిదా బేగం, శ్రావణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.