News August 21, 2025

‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్

image

TG: స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ రేపు తెలంగాణ బంద్‌కు OU JAC పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దానికి జనగామ స్వర్ణకారులు, కొండమల్లేపల్లి (నల్గొండ) వ్యాపారులు మద్దతు ప్రకటించారు. నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని తెలిపారు. మరోవైపు తమపై విద్వేషపూరిత ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్వాడీ వ్యాపారులు DGPకి ఫిర్యాదు చేశారు.

Similar News

News April 4, 2026

BSNLలో 120 పోస్టులు.. దరఖాస్తు గడువు పెంపు

image

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును APR-15 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణకు ఏప్రిల్ 16-23 వరకు అవకాశం ఉంటుంది. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: bsnl.co.in చూడండి.

News April 4, 2026

భారత్ సత్తా మర్చిపోయారా?

image

భారతీయుల ఇళ్లలోకి చొరబడతామన్న <<19562163>>పాక్<<>> మంత్రి ఓసారి గతాన్ని గుర్తుచేసుకోవాలి. 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే భారత సైన్యం పాక్‌ను చిత్తుచేసి బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించింది. అప్పుడు 93 వేల మంది పాక్ సైనికులు భారత్ ముందు తలవంచారు. ఇక 1999 కార్గిల్ యుద్ధంలోనూ శత్రువులను తరిమికొట్టి పర్వతాగ్రాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. 2025లోనూ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఉగ్రవాద స్థావరాలను ఏరిపారేశాం.

News April 4, 2026

IPL చూసేవారికి JIO షాక్

image

మెగా టోర్నీ వేళ రిలయన్స్ జియో రూ.195 క్రికెట్ డేటా ప్యాక్ విషయంలో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. గతంలో 90 రోజుల పాటు అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వ్యాలిడిటీని ఇప్పుడు కేవలం 30 రోజులకు తగ్గించింది. అయితే ఇందులో వచ్చే 15GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలను యథావిధిగా అందిస్తుంది. వ్యాలిడిటీ తగ్గడం వల్ల తక్కువ ధరకే ఎక్కువ రోజులు వాడాలనుకునే వారికి ఇది భారంగా మారింది.