News August 24, 2024
భారత్‌కు విచ్చేయండి జెలెన్స్కీ: మోదీ పిలుపు

ఉక్రెయిన్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీని భారత్‌కు ఆహ్వానించారు. ‘1992 తర్వాత మన ప్రధాని తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించడం విశేషం. ఇలాంటి సందర్భాలలో ఆహ్వానించడం సహజమే. ప్రధాని కూడా అదే చేశారు. వీలును బట్టి ఆయన భారత్ వస్తారని ఆశిస్తున్నాం’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. రెండుదేశాల సంయుక్త ప్రకటన కూడా దీన్ని ధ్రువీకరించింది.
Similar News
News November 13, 2025
ఎప్స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.
News November 13, 2025
ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
News November 13, 2025
విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్‌కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.


