News November 5, 2024

ఆడబిడ్డల పరామర్శకు వెళ్లండి పవన్: అంబటి

image

AP: పల్నాడు జిల్లాలో జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లాల్సింది. బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు!’ అని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News November 4, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.

News November 4, 2025

అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

image

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.