News May 13, 2024

పోలింగ్ బూత్‌కు వెళ్లి ఎన్నికలను బహిష్కరించొచ్చు!

image

ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’ ద్వారా ఓటర్లు తమ వ్యతిరేకతను తెలిపే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓటర్లకు ‘రెఫ్యూజ్ టు ఓట్’ అనే హక్కు కూడా ఉంది. అంటే పోలింగ్ బూత్‌కు వెళ్లి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఐడీ రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా పోలింగ్‌ను బహిష్కరించొచ్చు. ఓటు ద్వారా వ్యతిరేకత తెలిపేందుకు నోటా ఉంటే, ఎన్నికల ప్రక్రియనే బహిష్కరించే హక్కు ఈ ‘రెఫ్యూజ్ టు ఓట్’ కల్పిస్తోంది.

Similar News

News March 7, 2026

పెరిగిన ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజులు

image

TG: ప్రైవేటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-28 విద్యాసంవత్సరానికి బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37లక్షలుగా నిర్ధారించింది. గతంతో పోలిస్తే 10-15% పెరిగింది. కనిష్ఠ ఫీజును రూ.45వేలకు పరిమితం చేసింది. అయితే మెజార్టీ కాలేజీల్లో ఫీజులు రూ.50-80వేల మధ్య ఉన్నాయి. ఇక ఆర్కిటెక్చర్ ఫీజును గరిష్ఠంగా ₹1.32లక్షలుగా సర్కార్ నిర్ణయించింది.

News March 7, 2026

టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

image

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.

News March 7, 2026

కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

image

ఆన్‌లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.