News March 13, 2025
కళ తప్పిన గోవా టూరిజం.. కారణాలు ఇవే!

ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో కళకళలాడిన గోవా ప్రస్తుతం వెలవెలబోతోంది. 2019లో 85 లక్షల మంది రాగా, 2023లో 15 లక్షల మంది మాత్రమే సందర్శించారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయాసియాలో మరింత తక్కువ ధరలకు పట్టణాలు అందుబాటులో ఉండడం, గోవాలో ఆటో, ట్యాక్సీ మాఫియా, ఇక్కడ జీవన వ్యయం పెరగడం వల్ల విదేశీ టూరిస్టులు తగ్గారని సమాచారం. దీనిని పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
Similar News
News March 13, 2025
డిజిటల్ మోసాల్లో 83,668 వాట్సాప్ అకౌంట్లు బ్లాక్: బండి

డిజిటల్ అరెస్ట్ స్కాముల్లో 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసినట్లు హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీ అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ డీఎంకే ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇప్పటివరకు సైబర్ నేరాలపై 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. సుమారు రూ.4,386 కోట్ల నష్టాన్ని నివారించినట్లు తెలిపారు.
News March 13, 2025
WPL: గెలిస్తే ఫైనల్‌కే

WPL 2025లో ముంబై, గుజరాత్ మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఈ టోర్నీలో గుజరాత్‌పై ముంబై ఇప్పటివరకు ఓటమి లేకుండా సాగుతోంది. దీంతో ఇవాళ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ ఫైనల్ చేరింది. FINAL మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.
News March 13, 2025
నాని సవాల్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.