News July 22, 2024
ట్రంప్‌ను ఓడించడమే లక్ష్యం: కమలా హారిస్

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. తన అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు పలకడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. డెమోక్రాట్ల మద్దతు కూడగట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఆయన మద్దతు పలికారు.
Similar News
News November 24, 2025
HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.
News November 24, 2025
పెరిగిన మంచు తీవ్రత.. మినుము పంటకు తెగుళ్ల ముప్పు

గాలిలో అధిక తేమ, మంచు, మబ్బులతో కూడిన వాతావరణం వల్ల మినుము పంటలో.. కాయ దశలో ఆకు మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ఒక మి. లీ ప్రాపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి. వీటితో పాటు లీటరు నీటికి 1ml మైక్లోబుటానిల్ పిచికారీ చేసి బూడిద తెగులును కూడా నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు తెలిపారు.
News November 24, 2025
స్థానిక ఎన్నికల తేదీలపై 25న క్యాబినెట్ నిర్ణయం!

TG: కోర్టుల ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల్లో 50%లోపు రిజర్వేషన్లను ఖరారు చేశారు. పంచాయతీల రిజర్వేషన్లపై ఇవాళ కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాగా హైకోర్టు ఉత్తర్వులను బట్టి షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూడు దశల్లో నిర్వహణకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ నెల 25న జరిగే మంత్రివర్గ భేటీలో తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది.


