News April 2, 2025
దైవం మనుష్య రూపేణ.. మహేశ్‌పై ప్రశంసలు!

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా వైద్యం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ 4500కు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. తాజాగా పుట్టుకతోనే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేయించినట్లు పేర్కొంది. ఇందులో ఒకరికి రెండేళ్లు, మరొకరికి నాలుగు నెలలు మాత్రమే. దీంతో మహేశ్‌ది గొప్ప మనసంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
Similar News
News April 3, 2025
మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలి: CM

AP: నెలలో 4 రోజుల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాబినేట్ భేటీ అనంతరం సీఎం మంత్రులతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చేసిన మంచిని చెప్పుకోవాలని సూచించారు. ఏపీ పథకాల్లో నాలుగో వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేయట్లేదన్నారు.
News April 3, 2025
గిఫ్ట్‌గా మహిళలు..! సెక్స్ ఆరోపణలతో నటుడిపై కేసు

హాలీవుడ్ వెటరన్ యాక్టర్ జీన్ క్లాడ్ వాన్‌పై రొమేనియా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మానవ అక్రమ రవాణా బాధిత మహిళలతో సెక్స్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొమేనియాకు చెందిన క్రిమినల్ గ్రూప్ ఐదుగురు మహిళలను వాన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా వాన్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి ‘Kill ‘Em All 2’ అనే హాలీవుడ్ మూవీలో నటించారు.
News April 3, 2025
PPF నామినీ పేర్లను మార్చేందుకు ఛార్జీలుండవు: నిర్మల

PPF అకౌంట్లలో నామినీ పేర్లను మార్చేందుకు కొన్ని ఆర్థిక సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పేర్ల మార్పు, అప్‌డేట్ కోసం గతంలో రూ.50 వసూలు చేేసేవారని, ప్రస్తుతం ఆ ఛార్జీలు చెల్లించే అవసరం లేకుండా గెజిట్ తీసుకొచ్చామన్నారు. అలాగే, తాజాగా తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ బిల్లు ప్రకారం నలుగురు నామినీలను చేర్చుకోవచ్చని పేర్కొన్నారు.