News December 17, 2024
దేవుడా.. నేను ఇంకేం చేయాలి?: పృథ్వీ షా

విజయ్ హజారే ట్రోఫీకి యువ ఆటగాడు పృథ్వీ షాను ముంబై జట్టు పక్కన పెట్టింది. దీంతో షా ఇన్స్టాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘65 ఇన్నింగ్స్లో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేట్తో 3399 పరుగులు చేశాను. దేవుడా నేను ఇంకా ఏం చేయాలో చెప్పు? ఈ స్టాట్స్ ఉన్న నేను పనికిరానా? నీపైనే నమ్మకం పెట్టుకున్నా. జనానికి నమ్మకం ఉందని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను కచ్చితంగా తిరిగొస్తా. ఓం సాయిరాం’ అని స్టోరీ పోస్ట్ చేశారు.
Similar News
News December 9, 2025
నేడు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

TG: ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 10గంటలకు కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వర్చువల్గా ప్రారంభించనున్నారు. పలు కారణాలతో 6 జిల్లాల్లో(ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్) ఈ కార్యక్రమం జరగదు. కాగా ఈ ఒక్కో విగ్రహానికి రూ.17.50 లక్షల చొప్పున మొత్తం రూ.5.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
News December 9, 2025
ఈ రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
News December 9, 2025
నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.


