News April 1, 2024

పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబును దేవుడు క్షమించడు: బొత్స

image

AP: నిమ్మగడ్డ రమేశ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు వాలంటీర్లపై కుట్ర చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. ఇన్ని నెలలు పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘వికలాంగులు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు’ అని మండిపడ్డారు.

Similar News

News April 4, 2026

ముంబై తడ’బ్యాటు’

image

IPL: ఢిల్లీతో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ముంబై తడబడుతోంది. 10 ఓవర్లలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (35), రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) ఔటయ్యారు. సూర్య (29*), రూథర్‌ఫర్డ్ (5*) క్రీజులో ఉన్నారు. ముకేశ్ కుమార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ముంబై స్కోర్ 11 ఓవర్లలో 80/3గా ఉంది.

News April 4, 2026

వాషింగ్టన్ మేయర్ రేసులో భారత సంతతి మహిళ

image

US రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారత సంతతికి చెందిన రినీ సంపత్(31) దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అర్హత సాధించడానికి రినీ దాఖలు చేసిన పిటిషన్‌పై 4,500 మందికి పైగా సంతకాలు చేశారు. తమిళనాడులో జన్మించిన ఆమె ఏడో ఏట పేరెంట్స్‌తో కలిసి USకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్&సెక్యూరిటీలో పట్టా పొందారు.

News April 4, 2026

ఆస్ట్రేలియాకు తిరిగెళ్లిన కమిన్స్.. SRHలో చేరిక మరింత ఆలస్యం!

image

బ్యాటింగ్‌లో అదరగొడుతున్న SRH స్పెషలిస్ట్ బౌలర్లు లేక ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టీమ్‌లో చేరినప్పటికీ వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న పాట్ కమిన్స్ మ్యాచ్‌లు ఆడట్లేదు. తాజాగా ఫైనల్ మెడికల్ స్కాన్ కోసం ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లారు. ఆ దేశ క్రికెట్ బోర్డు అనుమతిస్తే ఈ నెల 17న భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. లేదంటే మరింత ఆలస్యం కానుంది.